Friday 10 March 2017

తాళి

""తాళి"
తవ్వకుండానే గుండెలోనికి చొచ్చుకొనిపోయి
తనచుట్టూ 
గుడి కట్టేసుకోని...
తానే దైవమై నిలబడుతుంది
                      ""తాళి""

సహనాన్ని  దారాదత్తం చేస్తూ
పైటచాటు నుండి
దోబూచులాడుతూ...
సాంప్రదాయపు కంచెను కంచు
కోటాల నిర్మించేస్తుంది... "" తాళి ""

అడుగు అడుగుకూ లక్ష్మణరేఖ గీస్తూ
అలంకారంగా
అమ్మాయిని చేరి అతివని చేసి
తాను ఆరోప్రాణమవుతుంది...
"తాళి"

శ్వాసించిన ప్రతిసారీ
నీకు నేనున్నాని గుర్తుచేస్తు
మూడుముళ్ళ బంధమే అయినా
ఏడేడు జన్మల అనుబంధానికి భాష్యమై నిలిచి చెదిరిపోని ముతైదుతనాన్ని సంస్కరిస్తుంది.
"తాళి"

No comments:

Post a Comment