Friday 22 September 2017

నాన్న...

అమ్మ.. ఏ చిన్న కష్టమొచ్చిన గుండెలోని బరువును కన్నీటిరూపంలో తేలిక చేసుకుంటుంది.

నాన్న..  ఎంత కష్టమొచ్చిన ఆ కన్నీళ్ళను దిగమింగుకొని చెమటగా మార్చి తన వాళ్ళకి బాధేంటో తెలియకుండా చేసేవాడు..

🌹🌹🌼🌼🌸🌸🌼🌼🌹🌹

కొమ్మలకే పూలు
పూస్తాయని
అనుకున్నా.!! 🌼🌼

కనురెప్పలు కూడా
పువ్వులా విచ్చుకొంటాయని
నిన్ను చుసాకే తెలిసింది.. 💖💖

Saturday 9 September 2017

ఆగిపోకు కాలమా.....

ఆగిపోకు కాలమా అశ తీరే వరకు

జారిపోకు మేఘమా ఝల్లు కురిసే వరకు

వాడిపోకు పుష్పమా వసంతం వచ్చే వరకు

మరచిపోకు మిత్ర్రమా....మరణించే వరకు

Tuesday 18 July 2017

తొలకరి జల్లు

తొలకరి జల్లు తాకగానే
విరజిమ్ముతోంది పుడమి పరిమళం...
ఎదురు చూస్తున్న నేస్తాన్ని కలిసానన్న పరవశం,,
తుళ్ళింతల తనువు తడిసిపొమ్మంటోంది తనివితీరా..

చిన్ని పాపలా చెలరేగి పోదామా....
చినుకు చినుకునీ ఒడసి పట్టుకుందామా...
మేఘాలతో చెలిమి చేద్దామా..?
మెరుపుల పందిరి కింద ఆడుకుందామా

మేం ఎవరనుకున్నారు!

మేం ఎవరనుకున్నారు!

సమాజం చెక్కిన శిల్పంలోని అబలలమో
సంప్రదాయపు వంటింటి కుందేళ్ళమో కాదు..

తాళికి తలవంచిన బొమ్మలమో ,
ఇంట్లో వంటింటికి పడగ్గదికి,
బజారు వ్యాపారానికి సరుకులం కాదు ..

ప్రేమోన్మాదానికి రాలిపడే
సుతారపు కుసుమాలం కాదు..

పంచాది నిర్మలం మేము ..
ఆకాశంలో సగం మేము..
అనంత కోటి నక్షత్రాల్లో సగంరా మేము..

Thursday 22 June 2017

బంధం💜

ఏ బంధం ఏ వరుసతో మనతో ముడిపడుతుందో.....💛
కాలం ఎవరిని ఎలా దూరం చేస్తుందో.....💜
ఎవరికీ అర్ధం కాని ప్రశ్నలు ఎన్నో.....💚

కొన్ని బంధాలు ఎందుకు కలుస్తాయో.....💚
ఎందుకు విడిపోతాయో ఎప్పటికి అర్థం కావు.....💛

కొన్ని బంధాలు అలా వచ్చి ఇలా వెళ్ళినా.....💜
ఎప్పటికి చెరగని గుర్తులా నిలిచిపోతాయి.....💚

Thursday 15 June 2017

అలనై నీ తలపులలో ఎగసి పడనా!!

గాలినై నిను తాకి పోనా!!

చినుకునై నిను చేరిపోనా!!

లేక సప్త వర్ణాల ధనస్సు

నీ కళ్ళలో నింపి పోనా....

ప్రకృతి.

స్త్రీ ఉదయిస్తుంది
స్త్రీ ఉప్పొంగుతుంది
స్త్రీ విచ్చుకుంటుంది
స్త్రీ పరిమళిస్తుంది
స్త్రీ వర్షిస్తుంది
తుదకా స్త్రీయే ప్రళయ మవుతుంది.
ప్రచండ శక్తియై "-విళయ తాండవమాడుతుంది.
ఇదే సృష్టి. ఇదే.. ప్రకృతి.

Sunday 11 June 2017

చీకటి

ప్రతిక్షణం నన్ను తడిమే నీ జ్ఞాపకాల సాక్షిగా చెప్పనా ఎలా చెప్పను నువ్వు నా ప్రాణమని...
నువ్వు లేనిదే నాకు ఈ వెన్నెల కూడా చీకటిని.

Sunday 7 May 2017

మాట

మర్చిపోనని మాట ఇస్తావా!
మాట ఇవ్వను..మనసు ఇస్తాను..
మాట ఇస్తే మరిచి పోతానని భయం
మనసు ఇస్తే మట్టిలో కలిసే వరకు మరచి పోనని నమ్మకం!

Wednesday 19 April 2017

గెలుపు

ఒట్టేసి చెపుతున్నాను...
జీవితంలో ఎన్నో ఆటంకాలు చవిచూసాను.

కానీ నీ రాకతో
నా జీవితం ఆనందపు హరివిల్లులా మార్చేసావ్....

ఎన్ని ఓటములు నాకు ఎదురైన సరే
నీ పెదవులపై నా వల్ల చిరునవ్వు ఉన్నంతకాలం
ప్రతి ఓటమి కూడా నాకు గెలుపేరా చిన్నితల్లి..

స్వేచ్చ....

స్వేచ్చ అంటే గుర్తుకు వచ్చేది పక్షి.... 
పంజరం అనగానే గుర్తొచ్చేది కూడా పక్షి ..... 

మన పిల్లలను పంజరంలో పక్షిలా చూద్దామా..... లేక....
స్వేచ్చగా ఎగిరే పక్షిలా చూద్దామా....

వారి ఆలోచనలకు రెక్కలు ఇచ్చి....
మన ప్రేమను చాటుకుందామా... లేక.... 
ఆంక్షలు పెట్టి కట్టడి చేసి కదలకుండా కట్టేద్దామా....

బంధాలు , బంధుత్వాలు , ప్రేమలు , గౌరవాలు....
స్వేచ్చను ఇవ్వడం వల్లే వారు ఉన్నతులుగా రాణిస్తారు....

మనకు సమస్యలు ఎన్నైనా ఉండవచ్చు.... కాని....
మన సమస్యలు వారి మనసుకి తగలకూడదు....

స్వేచ్చని ఇద్దాం సంతోషాన్ని పంచుకుందాము....

అన్వేషణ

అంతులేని కథని అన్వేషిస్తూ....
అంతం తెలియని దూరం ప్రయాణిస్తూ...
చిక్కుప్రశ్నలకు బదులు వెదుకుతూ...
నా... అన్వేషణ నీకోసం సాగుతూనే ఉంది...

Tuesday 18 April 2017

గతంలో గురువువై జ్ఞానాన్ని భోదించావు
ప్రస్తుతం ఒక పరీక్ష గా నిలిచావు

భవిష్యత్ లో నీ భరోసా నాకు ఉంటుందో లేదో తెలియకుంది

నీ బుజ్జమ్మ కోసం మీ ఈ బేటిని
ఒంటరిగా వదిలివేయడం భావ్యమా....

నిరీక్షణ...

నిద్దుర ఊహలకే ఊపిరిపోస్తుంటే...
ప్రతి నిమిషం ఆ నిద్దురను వరంగా..
మార్చమని కనులను కోరుకున్న...
ప్రతి క్షణం ఆ నీరాక కోసమే నా నిరీక్షణ...

Thursday 16 March 2017

🌻🌼🌼🌻

వేయబోయే అడుగులు నీకోసమే
చేయబోయే చెలిమి నీతోనే
ఆశగా అడుగుముందుకు వేస్తున్నా జీవిత పయనంవైపు
కష్టాలు ఎదురైనా పోరాడి పయనిస్తాను
అలుపన్నది తెలియదునాకు విజయమే నా గమ్యం
పయనిస్తూనే వుంటాను చల్లని నీ స్నేహం దొరికేంతవరకూ

ఆశ....

తీరమన్నది లేని అలకు...
ఎందుకో ఈ ఎగసిపాటు...!
గమ్యమన్నది లేని అడుగుకు...
ఎందుకో ఈ ఉలికిపాటు...!
నిదురరాని కంటిపాపలో...
కలల కెoదుకు ఎదురుచూపు...!
నువ్వులేని గుండెలోన...
చప్పుడన్నది ఎంతవరకు...!
నన్ను విడిచి నువ్వు వున్నా...
నిన్ను తలచే బ్రతుకుతున్నా...!
నిన్ను చేరే ఆశ నాలో...
చావదే ఏ జన్మకైనా...!

Friday 10 March 2017

తాళి

""తాళి"
తవ్వకుండానే గుండెలోనికి చొచ్చుకొనిపోయి
తనచుట్టూ 
గుడి కట్టేసుకోని...
తానే దైవమై నిలబడుతుంది
                      ""తాళి""

సహనాన్ని  దారాదత్తం చేస్తూ
పైటచాటు నుండి
దోబూచులాడుతూ...
సాంప్రదాయపు కంచెను కంచు
కోటాల నిర్మించేస్తుంది... "" తాళి ""

అడుగు అడుగుకూ లక్ష్మణరేఖ గీస్తూ
అలంకారంగా
అమ్మాయిని చేరి అతివని చేసి
తాను ఆరోప్రాణమవుతుంది...
"తాళి"

శ్వాసించిన ప్రతిసారీ
నీకు నేనున్నాని గుర్తుచేస్తు
మూడుముళ్ళ బంధమే అయినా
ఏడేడు జన్మల అనుబంధానికి భాష్యమై నిలిచి చెదిరిపోని ముతైదుతనాన్ని సంస్కరిస్తుంది.
"తాళి"

Monday 6 March 2017

Prema....

Kannulloni prema vennelye kurise....

Gonthuloni prema Gaanamye Palike......

Madhiloni prema moogaga piliche......

Hrudayam loni prema uvvetthuna egase....

Monday 20 February 2017

వేదన....

ఆవేదనతో బాధతో....
విసిగి వేసారిన....

నా కనుల నుండి రాలే ప్రతి భాష్పబిందువు....
నీ అరచేతిలో అది రక్తబిందువు....

Sunday 19 February 2017

మౌనం....

మౌనం..
ఓ నిశ్శబ్ద తరంగం
భాష లేదు..
భావం.. అనంతం...!!

ఒకరి పై ఒకరికి చచ్చి పోయేంత ప్రేమ ఉంటె
ఇంకొక్కరిని కలలో కూడా ఊహించుకోరు
అది ఆడ వారైనా మగ వారైనా !!!

Friday 10 February 2017

పగడాల పెదవులతోనే.....
బిడియాలు కలబడుతుంటే.....
వగలమారి చెక్కిలి మీద.....
పగటి చుక్క పకపకమంటే.....
శివమై అనుభవమై.....
శుభమై సుందరమై.....

Sunday 29 January 2017

రాజు మామయ్య.....

మా మామయ్య పేరు రాజు.....
తను అవలీలగా దులపగలడు మన సంస్కృతికి పట్టిన బూజు....

    అతనికి కవితలంటే మహా మోజు....
ఏదో ఒకటి రాస్తునే ఉంటాడు ప్రతిరోజు....
ఆ అక్షరాల జల్లును వేటితోనూ వేయలేము బేరీజు....

    తన ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఏదో ఒక రోజు....
ఆ వచ్చిన రోజు మా అందరికి అవుతుంది పండగ రోజు....
ఆ రోజు మా మామ అవుతాడు చుక్కల్లో రారాజు....

    తన కలలసౌధానికి తొలి అడుగు వేయిస్తాను ఈ రోజు....
ఆ రోజు రావాలని , మా కోరిక నెరవేరాలని....
ఆ దేవుడ్ని కోరుకుంటున్నాము ప్రతిరోజు....

Friday 27 January 2017

అనుభవం.

అనుభవం నేర్పిన పాఠాలు.....
ఐన్ స్టీన్ కూడా నేర్పలేడు.....

Sunday 22 January 2017

ఓర్పు - నేర్పు

ఐదుగుర్ని చేసుకున్నంత మాత్రానా ద్రౌపతి కాదు......
ఒక్కరిని  చేసుకున్నంత మాత్రానా సీత కాదు......

ఆడదానికి ఉండాల్సినది ఓర్పు నేర్పు.....
కష్టనష్టాలను భరించడానికి ఓర్పు కావాలి....
సంసారం చక్కదిద్దుకోవడానికి నేర్పు కావాలి.....

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి.....
దీపం ఆరిపోయాక మిగిలేది చీకటి మాత్రమే....

ఓర్పు నేర్పు లేకపోతే జీవితం వృధా.....
మిగిలేది వ్యధ.....

Friday 20 January 2017

బంధం....

ప్రేమని పంచాల్సిన అవసరము లేదు...!
బంధం తెంచుకోకుండా ఉంటే చాలు.....

Wednesday 18 January 2017

My Naughty......

దగ్గరయిన అనుబంధమా....
ఆలస్యంగా అందిన ఆత్మీయమా....
తప్పొప్పులను సరిదిద్దిన అనురాగమా....
నీ ఈ మజిలి చిరకాలం నాకు అందివ్వుమా....

Monday 16 January 2017

నేను మీ నుండి కోరుకునే ఆడపడుచు కట్నం......

గతాన్ని జ్ఞాపకంగా మలచుకుని .....
మీ బంగారు భవిష్యత్ కోసం తొలి అడుగు వేయండి.....
మీ మోము పైన చిరునవ్వు ను చెదరనివ్వకండి .....
అదే నేను మీ నుండి కోరుకునే ఆడపడుచు కట్నం......

Friday 13 January 2017

Guruvarya....

అవతలి మనిషి....
విసుగును సహనం తో ,...
కోపాన్ని క్షమ తో.....,
బలహీనతను ప్రేమ తో....,
తప్పును నవ్వు తో......,
ఎదుర్కొనే మనిషికి జీవితంలో విషాదం ఉండదు

My Guruji Narendar Tumma Always In My Heart.....

He Is Mentally Always With Me Like My Dad.....

ఆడపిల్ల

ఆడపిల్ల తలవంచుకుని నడవవలసిన పనిలేదు
తన తల్లిదండ్రులు తలవంచుకునేలా ప్రవర్తించకుండా ఉంటే చాలు

జీవితం....

గ్రీష్మo నవ్వుతుంది.....
హేమంతo హేళనచేస్తుంది....
ఆమని ఆగిపోతుంది...

కాలం కనురెప్పల సందుల్లోoచి....
నీటి చుక్కలా....రాలిపోతుంది...

ఆకాశం మీద సముద్రం వర్షమై ఏడుస్తుంది...
బహుశా....ఇదే జీవితం అనుకుంటా...

Thursday 12 January 2017

కలల్లో... కరుగుతున్న..... కాయాన్ని...
ఇలలోకి... తీసుకు రావాలని
కౌగిలించుకున్న దుప్పట్ల బాహు....బంధాలను విదుల్చుకుంటూ
విడివడడానికిష్ట పడక.....
మొరాయించే....మూసుకున్న కనురెప్పలని
బలవంతంగా తెరిచి.....
నిన్నటిలోకాన్నే నేడు చూస్తున్న

Wednesday 11 January 2017

My Dad Is My Hero.....

My Dad Is My Hero.....
My Heart.....
My Soul.....
My Affection.....
My Emotional.....
My Heartbeat.....
My Breath.....
My Strength.....
My Tears.......
My Bravery......
My God.....
My Friend....
My Love.....
My Smile.....
My Hope....

Finally My Everything My Dad.....

Nanna I Have EveryThing With U.....
Am Nothing Without U......

Tuesday 10 January 2017

కాలం గతం రెండు ఒక్కటే..!
ఒక్కసారి గడిచిపోయాక దేనినీ
వెనక్కి తిసుకురాలేం..
మనసులోని ఆనందం క్షణాలను.
గడచిపోయిన జ్ఞాపకాలను
కళ్ళలో జారుతున్న కన్నీళ్ళతో
గుర్తుచేసుకోవడం తప్ప..!!

పరిచయం....

కొన్ని పరిచయాలు అద్భుతాలు.
అవి జరిగేందుకు అరక్షణమే పడుతుంది, కానీ
అవి జీవితాలను మార్చేస్తాయి,

ప్రతీ క్షణాన్ని మధుర జ్ఞాపకంగా మారుస్తాయి.
అలాంటి వ్యక్తులు పరిచయం అవడం అదృష్టం,
వారిని నిలుపులేకపోవడం దురదృష్టం.

I AM NOTHING WITHOUT YOU....

YOU ARE MY LIFE "
you are the meaning of my life
you are the dream of my night
you are the lyrics of my feelings
you are the literature of my silence
you are the journey of my emotions
you are the translation of my heart
you are the definition of my identity
you are the part of my soul
you are everything for me
I am nothing without you...,,,,

ఓ మగువా నీకు వందనం....

Monday 9 January 2017

ఆనందం

మనల్ని ప్రేమించిన వాళ్ళు....
మనతో ఉన్నంత వరకు....
మన కన్నుల్లో ఆనందం నిలిచి ఉంటుంది....

అమ్మా....

నీ కంటిపాపగా నన్ను చూసుకున్నావు....
నా చంటిపాపగా నిన్ను చూసుకుని....
నిత్యం కాపాడుకుంటా అమ్మా....

నిర్ణయం నీకే వదిలేస్తున్నాను.....

కనురెప్పల చాటున కళవై కరిగిపోతావా.....
నా కన్నులలో వెలుగువై కడదాక నిలిచిపోతావా.....
హృదయంలో కదలాడే ఊహవి అవుతావా..... 
నా గుండె గుడిలో దేవుడివై కొలువుంటావా.....
నా  అరచేతిలో గోరింటవై కరిగిపోతావా..... 
అదే అరచేతిలో విధిరాతవై నాలో కలసిపోతావా.....  

నిర్ణయం నీకే వదిలేస్తున్నాను..... 
నువ్వు అవునంటే నీ గుండె సవ్వడిని అవుతా.....  కాదంటే నీ హృదయ స్పందనలో ఉఛ్వాస నిశ్వాసనై ప్రశ్నిస్తా......

ఓ అమ్మ ఆవేదన.....

మానవత్వం మంట కలిసినప్పుడు....
పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ....
ప్రేమ బందాన్ని మరచి....
బాద్యతలను విస్మరిస్తే....
ఇతరుల ముందు చేయి చాచి....
తన ఆత్మగౌరవం చంపుకోలేక....
ఒక తల్లి పడే కష్టం....

నీవు లేకపోతే....

Sunday 8 January 2017

ఓ ప్రేమా.....

కన్నుల్లో కలవరింత.....
హృదయంలో పలవరింత....
తనువంత పులకరింత.... 
నీ వలనే ఈ దిగులంతా....
ఎప్పుడు జరిగిందో ఈ వింతా....
జాలి చూపుమా కొంతా....
      
మా గురువు గారి గుండెల్లో మోగించావు జేగంట....
నిను చూసిన క్షణాన ఒళ్ళంతా మైమరపంట....
ఇకనైనా కాస్త కరుణ చూపమంట....
కరుణిస్తే తను ఆకాశంలో ఊరేగునంట....

త్వరగా అతని ఊహాల్లో తేలమంట....
లేనిచో అనర్దాలు జరుగునంట.... 
అతను గంగలో మునుగునంట....

అక్క....

Written By My Sweet Sister Punna Bhagyasri Bhagi
           నా పుట్టిన రోజుకి నాచెల్లి కానుక....
                     తన తొలి కవిత...

నిజానికి అక్కవే కాని....
అందరికి కనపడని అమ్మవి....

బంధానికి అక్కవి కాని....
బాధ్యతకు నాన్నవి...

ఏ జన్మలో ఏ పుణ్యం చేసామో తెలియదు కాని....
ఈ జన్మలో నిన్ను ఆ దేవుడు అక్కగా ఇచ్చాడు....

అక్కవై పుట్టావు.....
                 మరో అమ్మవై నిలిచావు....

అక్క  అమ్మలోని కమ్మనితత్వం....

                                                        నీ చెల్లి....(Bhagi)

నాన్న.....