Tuesday 18 July 2017

తొలకరి జల్లు

తొలకరి జల్లు తాకగానే
విరజిమ్ముతోంది పుడమి పరిమళం...
ఎదురు చూస్తున్న నేస్తాన్ని కలిసానన్న పరవశం,,
తుళ్ళింతల తనువు తడిసిపొమ్మంటోంది తనివితీరా..

చిన్ని పాపలా చెలరేగి పోదామా....
చినుకు చినుకునీ ఒడసి పట్టుకుందామా...
మేఘాలతో చెలిమి చేద్దామా..?
మెరుపుల పందిరి కింద ఆడుకుందామా

మేం ఎవరనుకున్నారు!

మేం ఎవరనుకున్నారు!

సమాజం చెక్కిన శిల్పంలోని అబలలమో
సంప్రదాయపు వంటింటి కుందేళ్ళమో కాదు..

తాళికి తలవంచిన బొమ్మలమో ,
ఇంట్లో వంటింటికి పడగ్గదికి,
బజారు వ్యాపారానికి సరుకులం కాదు ..

ప్రేమోన్మాదానికి రాలిపడే
సుతారపు కుసుమాలం కాదు..

పంచాది నిర్మలం మేము ..
ఆకాశంలో సగం మేము..
అనంత కోటి నక్షత్రాల్లో సగంరా మేము..