Wednesday 19 April 2017

గెలుపు

ఒట్టేసి చెపుతున్నాను...
జీవితంలో ఎన్నో ఆటంకాలు చవిచూసాను.

కానీ నీ రాకతో
నా జీవితం ఆనందపు హరివిల్లులా మార్చేసావ్....

ఎన్ని ఓటములు నాకు ఎదురైన సరే
నీ పెదవులపై నా వల్ల చిరునవ్వు ఉన్నంతకాలం
ప్రతి ఓటమి కూడా నాకు గెలుపేరా చిన్నితల్లి..

స్వేచ్చ....

స్వేచ్చ అంటే గుర్తుకు వచ్చేది పక్షి.... 
పంజరం అనగానే గుర్తొచ్చేది కూడా పక్షి ..... 

మన పిల్లలను పంజరంలో పక్షిలా చూద్దామా..... లేక....
స్వేచ్చగా ఎగిరే పక్షిలా చూద్దామా....

వారి ఆలోచనలకు రెక్కలు ఇచ్చి....
మన ప్రేమను చాటుకుందామా... లేక.... 
ఆంక్షలు పెట్టి కట్టడి చేసి కదలకుండా కట్టేద్దామా....

బంధాలు , బంధుత్వాలు , ప్రేమలు , గౌరవాలు....
స్వేచ్చను ఇవ్వడం వల్లే వారు ఉన్నతులుగా రాణిస్తారు....

మనకు సమస్యలు ఎన్నైనా ఉండవచ్చు.... కాని....
మన సమస్యలు వారి మనసుకి తగలకూడదు....

స్వేచ్చని ఇద్దాం సంతోషాన్ని పంచుకుందాము....

అన్వేషణ

అంతులేని కథని అన్వేషిస్తూ....
అంతం తెలియని దూరం ప్రయాణిస్తూ...
చిక్కుప్రశ్నలకు బదులు వెదుకుతూ...
నా... అన్వేషణ నీకోసం సాగుతూనే ఉంది...

Tuesday 18 April 2017

గతంలో గురువువై జ్ఞానాన్ని భోదించావు
ప్రస్తుతం ఒక పరీక్ష గా నిలిచావు

భవిష్యత్ లో నీ భరోసా నాకు ఉంటుందో లేదో తెలియకుంది

నీ బుజ్జమ్మ కోసం మీ ఈ బేటిని
ఒంటరిగా వదిలివేయడం భావ్యమా....

నిరీక్షణ...

నిద్దుర ఊహలకే ఊపిరిపోస్తుంటే...
ప్రతి నిమిషం ఆ నిద్దురను వరంగా..
మార్చమని కనులను కోరుకున్న...
ప్రతి క్షణం ఆ నీరాక కోసమే నా నిరీక్షణ...